ఎన్‌టీపీసీ ఆరో యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

కరీంనగర్‌: గోదావరిఖని సాంకేతిక సమస్య తలెత్తడంతో రామగుండం ఎన్‌టీపీసీలోని 500మెగా వాట్ల సామర్థ్యం గల ఆరో యూనిట్‌లో విద్యుదుత్పిత్తి నిలిచిపోయింది. బాయిలర్‌లో  ట్యూబ్‌ లీక్‌ కావడంతో ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు.