ఎఫ్‌డీఐలతో భారత వ్యాపార రంగం విదేశీ సంస్థల హస్తగతం

విజయవాడ: విదేశీ సంస్థలు పెద్దయెత్తున లంచాలు ఇచ్చి, లాబీయింగ్‌ చేసి, భారత వ్యాపారంగాన్ని హస్తగతం చేసుకోవడానికి సద్దమైనాయని ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ అన్నారు. ఈరొజు విజయవాడలో గాంధీనగర్‌ ఛంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో ‘రిటైల్‌ రంగంలో విదేశీ పెట్టుబడులు, ప్రభావం’ అన్న అంశంపై వ్యాపారులు ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన ప్రధానవక్తిగా పాల్గొన్నారు. భారత దేశంలో 40 వేల కోట్ల డాలర్ల రిటైల్‌ వ్యాపారం జరుగుతుందని, దీనిలో 4 కోట్ల మంది పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వాల్‌మార్ట్‌ ఇంతే వ్యాపారం కేవలం 22 లక్షలతోనే పని చేయించుకుంటుందని, అలాంటప్పుడు ఉపాధి ఎలా పెరుగుతుందని, ఇప్పటివరకు పెరిగిన దాఖలాలు ఎక్కడా లేవని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో వృద్ధిరేటు పెంచలేని విదేశీ సంస్థలు మనదేశంలో ఎలా పెంచుతాయని ఆయన అన్నారు.