ఎమ్మెల్యే కిషన్ రెడ్డితోనే ఇబ్రహీంపట్నం అభివృద్ధి సాధ్యం
మొండిగౌరెల్లి సర్పంచ్ బండిమీది కృష్ణ మాదిగ
బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్26(జనంసాక్షి)
బిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని మొండిగౌరెల్లి గ్రామ సర్పంచ్ బండిమీది కృష్ణ మాదిగ అన్నారు. గ్రామానికి చెందిన తీగల ముత్తమ్మ అనారోగ్యంతో బాధపడుతూ.. సర్పంచ్ బండిమీది కృష్ణ ను సంప్రదించగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే మంచిరెడ్డి సహకారంతో మంజూరైన 28 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ముత్తమ్మకు అందజేశారు. అభివృద్ధి సంక్షేమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ముందుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరవేయడంలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కట్టెల కృష్ణయ్య, యూత్ అధ్యక్షులు అంబేద్కర్, ఉపాధ్యక్షులు డేరంగుల శ్రీనివాస్, వార్డు సభ్యులు మౌనిక ప్రహ్లద్, గజ్జల కృష్ణ, నాయకులు తీగల దశరథ, బండారి అంజయ్య, గురుక కుమార్, కర్నాటి యాదయ్య మాదం మల్లయ్య,కర్నాటి శంకర్ తదితరులున్నారు.