ఎమ్మెల్యే సండ్ర ఇంటిగోడకు ఏసీబీ నోటీసులు

హైదరాబాద్:సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇంటి గోడకు ఏసీబీ నోటీసులు అంటించింది. హైదర్ గూడలోని సండ్ర క్వార్టర్ కు ఉన్న ఇంటికి అంటించిన నోటీసులో ఈ నెల 19వ తేది సాయంత్రం 5 గంటల వరకు విచారణకు రావాలని ఆదేశించారు. గత రాత్రి సండ్ర ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్లగా అక్కడ లేకపోవడంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు కిటికీ ద్వారా ఇంట్లోకి వేసిన తెలిసిందే.