ఎయిడెడ్ ఉపాధ్యాయుల చర్చల్లో అంగీకారం
హైదరాబాద్: ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల పదోన్నతులు, రేషనలైజేషన్, బదిలీల ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఎయిడెడ్ ఉపాధ్యాయుల బృందంతో మంత్రి పార్ధసారధి జరిపిన చర్చల్లో ఒక అంగీకారం కుదిరింది. విద్యార్థులు లేని పాఠశాలల నుంచి వారున్న పాఠశాలలకు వారిని బదిలీ చేస్తామని ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పార్ధసారధి వివరించారు.



