ఎయిర్‌పోర్టులో ప్రమాణికుల ఆందోళన
హైదరాబాద్ : జెడ్డా వెళ్లాల్సిన ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. జెడ్డా వెళ్లాల్సిన విమానం నలబై మంది ప్రయాణికులను విమానాశ్రయంలోనే వదిలి వెళ్లడంతో వారు విమానాశ్రయ అధికారుల కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. విమానంలో పరిమితికి మించి టికెట్లు ఇచ్చి తీసుకుపోలేక విమానం తమను వదిలి వెళ్లిందని వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారలు వారిని ఒక ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాటుచేశారు. ఈ నెల 9న వారిని వేరే విమానంలో పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.


