ఎర్రచందనం చెట్లు నరికే 26 మంది కూలీల అరెస్టు

యాదమర్రి: చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్న 26 మంది ఎర్రచందనం చెట్లను నరికే కూలీలను యాదమర్రి పోలీసులు అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు బస్సులో తమిళనాడు రాష్ట్రం నుంచి వస్తుండగా తనిఖీలు చేపట్టి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.