ఎర్రచందనం స్మగ్లర్‌లను వదిలిపెట్టొద్దు : సీఎం

హైదరాబాద్‌ : చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జోరుగా సాగుతోంది. దీనిపై ముఖ్యమంత్రి స్పందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసేవారు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దంటూ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ జిల్లాల మీదుగా ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు వార్తాకథనాలు రావడంతో స్పందించిన ముఖ్యమంత్రి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు