ఎస్పీ, ఎస్టీ నిధులు మళ్లించకుండా నిషేధించాలి: చంద్రబాబు
నిజామాబాద్ : జనాఖా ఆధారంగా ఎస్పీ , ఎస్టీలకు నాధులకు కేటాయించాలని ప్రణాళిక సంఘం ఏనాడో చెప్పిందని తెదుపా అధినేత చంద్రబాబునాయుడు గుర్తుచేశారు, వస్తున్నా మీకోసం పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు నిజామాబాద్ జిల్లా మైలారం వద్ద మీడియాతో మాట్లాడారు, ఎస్పీ ఎస్టీ నిధులు వెరె పథకాలను మళ్లించకుండా నిషేధించాలని కోరారు. దళిత గిరాజన ఉపప్రణాళిక బిల్లులో పదేళ్ల కాలపరిమితి పెట్టడం సరికాదని అన్నారు. దళతగిరిజన ప్రణాళిక బిల్లులో వర్గీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తమ హయంలో ఎస్పీ వర్గీకరణతో మాదిగ ఉపకులాలకు 24.500 ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేశారు. వర్గీకరణ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని ఉషా మెహ్రా కమిషన్ స్పష్టంగా చెప్పిందని తెలిపారు. దీనిపై ఇప్పటివరకు కాంగ్రెస్ స్పందించడం లేదని విమర్శించారు.



