ఎస్సీ వర్గీకరణపై చర్చకు ప్రతిపక్షాల పట్టు 

– మరోసారి చర్చిద్దామన్న మంత్రి హరీష్‌రావు
– బిఏసీ నిర్ణయాలకు వ్యతిరేకంగా నడుచుకోవద్దని సూచన
– వాయిదాతీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్‌
– నిరసనగా సభనుంచి కాంగ్రెస్‌ సభ్యుల వాకౌట్‌
– ఖచ్చితంగా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తాం – మంత్రి ఈటల
హైదరాబాద్‌, నవంబర్‌6(జ‌నంసాక్షి) : ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ నిర్వహించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈస ందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా.. ఎస్సీ వర్గీరణపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.. దీంతో మిగతా పార్టీల సభ్యులుసైతం ఎస్సీవర్గీకరణపై చర్చకు పట్టుబట్టారు.. దీంతోక కలుసుగజేసుకున్న మంత్రి హరీష్‌రావు ఎస్సీ వర్గీకరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఈ విషయమై మరోసారి చర్చిద్దాంమని, మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపుదాని మంత్రి స్పష్టం చేశారు. ఈసారి మాత్రం కేంద్రాన్ని గట్టిగా అడుగుదామన్నారు మంత్రి. ఈ చర్చపై స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు. బీఏసీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.  ఈరోజుకూడా కూడా పోడియం వద్దకు వస్తే బీఏసీ తీసుకున్న నిర్ణయాలను మనమే వ్యతిరేఖించినట్లు ఉంటుందని మంత్రి సూచించారు. ప్రభుత్వం తరపున మేం చర్చకు సిద్ధం.. విూ పార్టీ నేతలను ఎప్పుడు తీసుకొస్తారో చెప్పండని మంత్రి కాంగ్రెస్‌ సభ్యులకు చెప్పారు. ఇంకా చాలా ప్రశ్నోత్తరాలపై మాట్లాడాల్సి ఉంది దయచేసి సభ సమయాన్ని వృథా చేయవద్దని శాసనసభ సభ్యులను మంత్రి హరీష్‌ కోరారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు లేవనెత్తిన వాటికి సమాధానం ఇవ్వకుండా మా ఇష్టంమొచ్చినట్లు సభను నడుపుతామంటే మేముందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ మధుసూదనాచారి తిరస్కరించడం సిరికాదన్నారు.  ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఇచ్చిన హావిూ విస్మరించిందని, సభలో ప్రస్తావిస్తే సమాధానం చెప్పడం లేదని ప్రతిపక్ష నేత జానారెడ్డి పేర్కొన్నారు. దీనికి నిరసనగా కాంగ్రెస్‌ సభ్యులు సభ నుండి వాకౌట్‌ చేస్తున్నట్లు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ న్యాయమైన అంశం : మంత్రి ఈటల
ఎస్సీ వర్గీకరణ న్యాయమైన అంశమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ఎవరూ కోరకపోయినప్పటికీ 29 నవంబర్‌ 2014న సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం పెట్టిందని గుర్తు చేశారు. ఆ రోజు ఎస్సీ వర్గీకరణపై ఈ సభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం అందరికీ తెలుసన్నారు. ఇప్పటి దాకా వాకౌట్‌ చేసిన కాంగ్రెస్‌.. పది సంవతసరాల పాటు ఇక్కడ, అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణను పట్టించుకోలేదని కోపోద్రిక్తులయ్యారు. సీఎం కేసీఆర్‌, కడియం శ్రీహరి కలిసి ఈ విషయాన్ని ఢిల్లీలో నరేంద్ర మోదీకి దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్లే ముందు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ రద్దు అయిందన్నారు. వర్గీకరణ న్యాయమైన అంశం కాబట్టి.. తప్పకుండా మోదీ అపాయింట్‌మెంట్‌ తీసుకుని కచ్చితంగా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పారు. అవసరమైతే మరోసారి ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు ఈటల తెలిపారు. బీజేపీ నేతలు విూవంతు ప్రయత్నం చేయాలని ఈటెల సూచించారు. ప్రధానిమోదీతో విూటింగ్‌ ఏర్పాలయ్యేలా విూవంతు సహకరించాలని తద్వారా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వివరిద్దామన్నారు.

తాజావార్తలు