ఏఆర్‌ డీసీపీ నాగన్నను విధులనుంచి తొలగించిన ప్రభుత్వం

హైదరాబాద్‌: సాయుధదశా (ఏఆర్‌) డీసీపీ ఎం, నాగన్నను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన విజయవాడ రైల్వేఎస్పీగా పనిచేసిన సమయంలో బంగారం రికవరీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.