ఏకదంతుణ్ణి దర్శించుకున్న జిల్లా అధ్యక్షులు రేగా
పినపాక నియోజకవర్గం ఆగష్టు 31 (జనం సాక్షి): మణుగూరు మండలం ఎస్ బి ఐ సెంటర్ లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విజ్ఞేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపారు, విగ్నేశ్వరుడి ఆశీర్వాదాలతో విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, వ్యాపారస్తులు ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు