ఏక్షణం ఎన్నికల వచ్చిన సిద్దం : ఎంఐఎం

హైదరాబాద్‌: యూపీఏ, కిరణ్‌ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకున్న ఏ క్షణం ఎన్నికలు వచ్చిన సిద్దమేనని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ప్రకటించారు. మద్దతు ఉపసంహరణపై వెనక్కుతగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. యూపీఏకు మద్దతు ఉపసంహరణపై రాష్ట్రపతికి లేఖ రాయనున్నట్లు తెలియజేశారు. ఈ అంశంపై నాంపల్లిలోని దారుసంలేంలో భేటీ అయిన ఎంఐఎం పోలీట్‌బ్యూరో సమావేశం ముగిసింది. అనంతరం ఎంపీ అసదుద్దీన్‌ మీడియాతో మాట్లాడారు. ఇక కాంగ్రెస్‌తో పోత్తు ఉండదు అని స్పష్టం చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయాలవల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు.

తాజావార్తలు