ఏపీసెట్‌లో అర్హత సాధించినవారికి ధ్రువపత్రాల ప్రదానం
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం తొలిసారి నిర్వహించిన ఏపీసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల ప్రదానం లాంఛనంగా ప్రారంభమైంది. ఏపీసెట్ భవనంలో జరిగిన ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమానికి ఓయూ వీసీ సత్యనారాయణ, రిజిస్ట్రార్ కిషన్‌రావు హాజరయ్యారు. ఏపీసెట్ పరీక్ష కోసం 24 సబ్జెక్టుల్లో 1,17,795 మంది అభ్యర్థులు నమోదుచేసుకోగా 96,955 మంది హాజరయ్యారు. ఏపీసెట్ పరీక్ష కోసం 24 సబ్జెక్టుల్లో 1,17,795 మంది అభ్యర్థులు నమోదుచేసుకోగా 96,955 మంది హాజరయ్యారని 8,007 మంది అర్హత సాధించారని వీసీ వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులంతా యూనివర్శిటీలోని ఏపీసెట్ భవనంలో తమ ఉత్తీర్ణతా ధ్రువపత్రాలను పొందవచ్చని తెలియజేశారు.



