ఏప్రిల్‌ 15 నుంచి జాతీయ దళిత భూహక్కుల సాధన ఉద్యమం

బాగ్‌లింగంపల్లి: ఏప్రిల్‌ 15నుంచి జాతీయ దళిత భూహక్కుల సాధన ఉద్యమం చేపడుతున్నామని దళిత బహుజన ఫ్రంట్‌ అధ్యక్ష కార్యదర్శలు వినయ్‌కుమార్‌, శంకర్‌లు స్పష్టం చేశారు. శుక్రవారం సుందరయ్య కళా నిలయంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అసైన్డ్‌ భూ సమస్యలు, దళితుల భూ సమస్యల పై పోరాటం చేస్తున్నామన్నారు. అలాగే ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం సమగ్ర చట్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు దుర్గా ప్రసాద్‌, ప్రకాశ్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.