ఏప్రిల్‌ 7,8 తేదీల్లో కెవిపిఎస్‌ 2వ రాష్ట్ర మహసభలు

హైదరాబాద్‌ ఏప్రిల్‌ 7,8 తేదీల్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(ఎవిపిఎస్‌) రెండవ రాష్ట్ర మహసభలు హైదరాబాద్‌ నగరం లక్షంపెట మృతవీరుల ప్రాంగణం, ఎన్‌ఆర్‌ శంకరన్‌ హలులో జరగనున్నాయి. డక్టర్‌ బిఅర్‌ అంబేద్కర్‌,డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతుల సంధర్బంగా ఈ మహసభలను నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రదాన కార్యదర్శి జాన్‌ వెస్టి శుక్రవారం రోజు ఒక ప్రకటనలో తెలిపారు. సభలు ప్రారంభం రోజు ఏప్రిల్‌ 7న ‘సామాజిక న్యాయం దళితులు’ అంశంపై జాతీయ సెమినార్‌, కుల వివక్ష, నిర్మూలన, దళిత, గిరిజన వాడల అభివృధ్ధి, ఎస్సి, ఎస్టి సబ్‌ ప్లాన్‌ అమలుపై వివిధ సంఘాల నాయకులు, మేధావులతో ‘మేధొమధనం’ జరుగుతుందని తెలిపారు. ఈ సభలకు దాదాపు 1000 మంది ప్రతినిధులు హజరుకానున్నట్లు తెలిపారు. సామాజిక, ఆర్ధిక అంశాలపై భవిష్యత్‌ కర్తవ్యాల రూపకల్పనకై జరుగుతున్న ఈ సభలను విజయవంతం చేయలని విఙప్తి చేశారు. మన దేశంలో ఆమానుషమైన ఆంటరానితనం, కుల వ్యవస్ధ దీర్ఘకాలికంగా కోనసాగుతున్నదని పేర్కోన్నారు. కుల వ్యవస్ధ నిర్మూలనకై జోతిరావుపూలె, బిఅర్‌ అంబేద్కర్‌ తదితర సామాజికోద్యమ నాయకులు, అభ్యుదయ వాదులు కృషి చేశారని తెలిపారు. వారి ఆశయ సాధనకై 1998 అక్టోవబర్‌2న కెవిపిఎస్‌ ఆవిర్బవించిందని, అప్పటి నుండి ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలనకై పోరాటాలు నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తెచ్చిందని గుర్తుచేశారు.వాటి నిర్మూలనకై 21 జివోలు, రాష్ట్ర ఎస్సి, ఎస్టి కమిషన్‌ పోరాడి సాదించిందని పెరోన్నారు. మహిలల పై కోనసాగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతోందని తెలిపారు. ఈ కృషి మరింత ముందుకు తీసుకువెళ్లెందుకు ఈ మహసభలు నిర్వహిస్తున్నామని, ఈ మహసభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.