ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ

హైదరాబాద్‌: ఢిల్లీలో వైద్య విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్‌ చేసింది. ఈ రోజు ఏబీవీపీ కార్యకర్తలు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆర్ట్స్‌కళాశాల నుంచి మొదలై తార్నాక వైజంక్షన్‌ వరకూ సాగింది. అమ్మాయిలపై అఘాయిత్యాలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం సిగ్గు చేటన్నారు. అసమర్థ పాలన సాగిస్తున్నా ప్రధాని వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ డిమాండ్‌ వ్యక్తం చేశారు.