ఏ శక్తులు అడ్డువచ్చినా తెలంగాణను అడ్డుకోలేరు : కిషన్‌రెడ్డి

భువనగిరి: తెలంగాణను అడ్డుకునే శక్తి ఏ పార్టీకీ లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. వెయ్యి మంది చంద్రబాబులు, వెయ్యి మంది జగన్‌లు, సోనియాలు అడ్డువచ్చినా తెలంగాణను అడ్డుకోలేరన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర భువనగరికి చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ఇస్తుందని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.