ఐఏఎస్ అధికారుల బదిలీలు
హైదరాబాద్: కొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయశాఖ కమిషనర్ బలరామయ్య సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. విశాఖ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ ఎండీ కేవీ రమణ స్థానంలో ఇ. రమేశ్ నియమితులయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాజెక్టు డైరెక్టరు ముత్యాల రాజు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. వరంగల్ జిల్లా ఏపీఎస్‌డీసీఎల్ ఛైర్మన్ అండ్ ఎండీ సీహెచ్ నర్సింహారెడ్డి బదిలీ కాగా ఆ స్థానంలో బోథన సబ్‌కలెక్టర్‌గా ఉన్న కార్తికేయ మిశ్రాని నియమించారు.



