ఐకాస నేతల ఢిల్లీ పర్యటన వాయిదా

హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయంచుకున్న తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు తమ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్నా షెడ్యూల్‌ ప్రకారం ఐకాస నేతలు ఈ నెల 13న ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. యూపీఏలోని కీలక భాగస్వామ్య పార్టీల నేతలు కొందరు అందుబాటులో లేరని తెలిసింది. దీంతో తమ ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నామని ఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం శనివారం తెలిపారు. యూపీఏ భాగస్వామ్య పక్షాల్లోని అందుబాటులో ఉన్న నేతలను కలవాలని ఢిల్లీ ఐకాస నేతలతో చెప్పామన్నారు. జైపూర్‌లో జరిగే కాంగ్రెస్‌ మేధోమథనంలో తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఐకాస ఆధ్వర్యంలో ఈనెల 17న భారీ కార్యక్రమాన్ని చేపట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 27న ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తామని వివరించారు.