ఐటిడిఏ ఏటూరు నాగారం కార్యాలయం సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

share on facebook
ములుగు ఆగస్టు21(జనం సాక్షి):
ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య  ఐటీడిఏ ఇంఛార్జ్  తీసుకున్న తర్వాత  మొదటి సారిగా ఐటిడిఏ  కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.  కార్యాలయంలో ఉన్న వివిధ శాఖల   కార్యాలయాలు, రికార్డ్ రూం లను క్షుణ్ణంగా  పరిశీలించారు.రికార్డ్ రూంల పరిస్థితి  అధ్వానంగా ఉన్నాయని,వాటి నిర్వహణను వివిధ విభాగాలకు,సెక్షన్స్ వారీగా రికార్డు రూం లో ఫైళ్ళ ను భద్రపరచాలని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా అటెండెన్స్ ఆప్ సోమవారం నుండి అందరూ తప్పనిసరిగా ఉపయోగించాలని కలెక్టర్ అన్నారు. క్వాలిటీ కంట్రోల్ శాఖ మినహా వివిధ శాఖలలో  అధికారులు,సిబ్బంది పొరుగు సేవల్లో విధులు నిర్వర్తిస్తున్నటైతే వారి  డెప్యుటేషన్ రద్దు చేయాలని వారు అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు,టీచర్స్ వివరాలు సేకరించి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విధినిర్వహణలో బాగంగా ప్రతి ఫైల్ ను ఆన్లైన్ ద్వారా ఫైల్ ప్రాసెస్ చేయాలని కలెక్టర్  అన్నారు.అలాగే ఉద్యోగుల వివరాలు,పెండింగ్ ఇష్యూల పైన ఇఇ ట్రైబల్ వెల్ఫేర్ హేమలత ను అడిగి తెలుసుకున్నారు.కార్యాలయం చుట్టూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉండాలని, ఐటిడిఏ ప్రాంగణంలో పిచ్చి మొక్కలను తీసేసి శుభ్రంగా ఉండేలా చూడాలని ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఏర్రయ్య కు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ  వసంతరావు, డిడి ఎర్రయ్య,ఏవో రఘు, ఎస్ఓ రాజ్ కుమార్,  డిఎం&హెచ్ఓ ఐటిడిఎ డాక్టర్ వెంకటేశ్వర్లు, డిఎంఈసిసి ప్రతాప్ రెడ్డి,ఆర్సిఓ రాజ్యలక్ష్మి,వెంకన్న, లక్ష్మీ ప్రసన్న,ఐటీడిఏ మేనేజర్ లాల్ నాయక్,సంబంధిత శాఖల అధికారులు,సిబ్బంది  పాల్గొన్నారు.

Other News

Comments are closed.