ఐర్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు

కొలంబొ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబొలో ఐర్లండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐర్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. ఐర్లండ్‌ జట్టులో ఒబ్రియన్‌ 25, స్టిర్లింగ్‌ 19, విల్సన్‌ 21, కె.జె ఒబ్రియన్‌ 13, జాన్‌స్టాన్‌ 15, జోనన్‌ 14 పరుగులు చేశారు. వెస్టిండీస్‌ జట్టులో గేల్‌ 2, ఎడ్‌వర్డ్స్‌, రాంపౌల్‌, సమ్మీ, నారియన్‌ తలో ఒక వికెట్‌ తీశారు.