ఒకరి మృతి, ఇరువురికి గాయాలు
బంటుమిల్లి: కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన సాప్ట్‌వేర్
ఉద్యోగిని లలిత అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె భర్త
గొర్ల వీరాంజనేయులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆదివారం తెల్లవారుజామున శాన్ ఫ్రాన్సిస్కోలో వీరి కుటుంబం కారులో వెళ్తుండగా ఈ
ప్రమాదం జరిగింది. అదే కారులో ప్రయాణిస్తున్న వీరి బంధువు గొర్ల సత్య
నారాయణమూర్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లలిత స్వగ్రామం
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు.



