ఓటు వేసిన నరేంద్రమోడీ
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ తుది దశ ఎన్నికల పోలీంగ్ కొనసాగుతోంది. మూడోసారి విజయంపై ధీమాతో ఉన్న ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లోని రానివ్ ప్రాంతంలోని నిషాన్ పాఠశాల కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం విజయం సంకేతాన్ని చూపిస్తూ బయటకు వచ్చారు. తుది దశలో మొత్తం 95 నియోజకవర్గాల్లో ఈ ఉదయం పోలీంగ్ 8 గంటలకు ప్రారంభమైంది. మొదటి రెండు గంటల్లో 15 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.