ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా

విశాఖ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వాయలార్‌ రవి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపాడ్డారు. సీమాంధ్రలో ఉద్యమాలు సరిగా చేయలేదన్న వాయలర్‌ వాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు. ఒక్క రోజులోనే వంద మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన ఘనత సీమాంధ్రలోనే ఉందని ఆయగుర్తు చేశారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ బలహీనడిదని.. అందుకే తెలంగాణ ఇస్తున్నారన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా? అని ప్రశ్నించారు.