ఓయూ విద్యార్థుల ర్యాలీ ప్రారంభం

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధిని అరుణ హత్య కేసులో నిందతులకు కఠినశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తూ ఓయూ విద్యార్థులు ర్యాలీ ప్రారంభించారు. రాష్ట్ర హోంశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం వరకు ర్యాలీ కొనసాగనుందని విద్యార్ధి నేతలు తెలియజేశారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు గట్టి భద్రాతా ఏర్పాటు చేశారు.