ఔషధ రంగంలో భారత్ ప్రపంచానికే దిక్సూచి

ఔషధ రంగంలో భారత్ ప్రపంచానికే దిక్సూచి

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 23 (జనం సాక్షి)
ప్రపంచానికి భారత్ ఔషధ రంగంలో ఒక దిక్సూచిగా ఎదిగిందని డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా డాక్టర్ రామ్ కిషన్ అన్నారు. శనివారం వరంగల్ నగరంలోని ఉరుసు వద్ద గల తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాలలో కళాశాల చైర్మన్ తాళ్ల మల్లేశం అధ్యక్షతన ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా డాక్టర్ రామ్ కిషన్, ఐడిఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జె రాజమౌళి, అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా డాక్టర్ వినయ్ కుమార్ గుప్తా ప్రత్యేక అతిధులుగా హాజరవగా కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల డీన్ ప్రొఫెసర్ వై. నర్సింహారెడ్డి హాజరయ్యారు. అంతకుముందు మీరంతా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ కిషన్ మాట్లాడుతూ మానవాళికి గత కొంతకాలం క్రితం బీభత్సం సృష్టించి విజృంభించిన కరోనా ప్రపంచ మానవాళికి ఒక గొప్ప గుణపాఠం నేర్పింది అన్నారు. విశ్వ మానవ శ్రేయస్సుకోసం ఔషధ రంగ విద్యార్థులు కృషి చేయాలని కోరారు. డాక్టర్ రాజమౌళి మాట్లాడుతూ కళాశాల నుండి అపారమైన ఔషధ పరిజ్ఞానం నైపుణ్యంతో బయటకు వచ్చి ఉన్నతమైన ఉద్యోగాలతో స్థిరపడటమే కాకుండా సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలన్నారు. డాక్టర్ విజయకుమార్ గుప్తా మాట్లాడుతూ విద్యార్థులు ఔషధ పరిజ్ఞానంతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. డాక్టర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఫార్మా విద్యార్థులు పరిశోధనలపై దృష్టి పెట్టాలన్నారు. కళాశాల చైర్మన్ తాళ్ల మల్లేశం మాట్లాడుతూ తమ కళాశాలలో నైతిక విలువలతో కూడినటువంటి మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని శిక్షణ బోధనలో అవసరమైన మార్పులు చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు తాళ్ల వరుణ్ వైష్ణవి అధ్యాపకులు బేతి శ్రీనివాస్, పుష్టి, సత్యనారాయణ పట్నాయక్, కల్పనా,  నాగిరెడ్డి, శ్రీనివాస్, రఘునందన్, శ్రీధర్ బాబు, కమల్ యాదవ్, అనిల్ సునీల్, కిరణ్ కుమార్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

 

 

తాజావార్తలు