కక్ష్య సాధింపు చర్యలు తగవు.,

బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి.

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్: కాంగ్రెస్ 6 నెలల నుండి అరాచకపాలన సాగిస్తున్నది నియోజకవర్గాన్ని అవినీతి అడ్డాగా మార్చారని బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
నేరేడుచర్ల బీజేపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ప్రతి కార్యకర్తలు అండగా ఉంటామని,కాంగ్రెస్ పాలనలో జరిగే అవినీతిని ఇక నుండి అడ్డుకునే దిశగా ఉంటాము
భయపెట్టి పాలన సాగించలేరు గతంలో ఒక్క రాజకీయ కేసు కూడా ప్రతిపక్షాలపై పెట్టలేదు. మేము ఎప్పుడు ఇలాంటి చర్యలు చేయలేదు.సామరస్యంతో ఉన్నాము.ప్రభుత్వం పై వ్యతిరేకత మొదలైంది అది తట్టుకోలేక కక్ష్య సాధింపు చర్యలు చర్యకు ప్రతి చర్యలు ఉంటాయి అధికారులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు పార్ధన బోయిన విజయ్ కుమార్,బిజెపి నాయకులు బాల వెంకటేశ్వర్లు, చింతకుంట్ల సోమిరెడ్డి, కోణతం నాగిరెడ్డి, జగతయ్య గౌడ్, రామ్మూర్తి,తదితరులు పాల్గొన్నారు.