కఠోర సాధన -పథకాల పంట

కఠోర సాధన -పథకాల పంట

దేవరకొండ సెప్టెంబర్ 24
(జనం సాక్షి):-ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి అండర్ 17 -2023 క్రీడా పోటీలు మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో శనివారం అట్టహాసంగా ముగిసాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకొండ డిఎస్పి గిరిబాబు హాజరై విజేత జట్టుకు బహుమతులు అందజేశారు.ఈసందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని,క్రీడలు దేహదారుఢ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొదిస్తాయని, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులకు ఎలా అధిగమించాలో తెలియజేస్తాయని అన్నారు. గత మూడు రోజులుగా జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి పోటిల్లో అన్ని విభాగల్లో ఎస్ ఓ ఈ, అనంతారం (భువనగిరి) పాఠశాల విద్యార్థులు గెలుపొందినట్లు ప్రిన్సిపాల్ రజిత తెలిపారు. ఈకార్యక్రమంలో డిండి సి ఐ సురేష్, ఏఎన్ఓ గోపాల్ కృష్ణ, ఏటీపి సోమాంజీ, ఉపాధ్యాయులు వెంకటరమణ, రామయ్య, రవి, రాజు,తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు