కడియంతో రమణారావు భేటీ

హైదరాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వరంగల్‌ డైరెక్టర్‌ గా నియామకమైన ప్రొఫెసర్‌ ఎన్‌.వి రమణారావు శనివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నిట్‌ వరంగల్‌ డైరెక్టర్‌ గా ఎన్‌.వి రమణారావు మంచి సేవలందించాలని, నిట్‌ను మరింత అభివృద్ధి చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆకాంక్షించారు. నిట్‌ వరంగల్‌ను దేశంలో నెంబర్‌ వన్‌ స్థానానికి తీసుకెళ్లాలన్నారు. నిట్‌ డైరెక్టర్‌ కావడం పట్ల రమణారావును అభినందించారు. ఇటీవలే నిట్‌ డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.