కనీస వేతనం అమలు కోసం గ్రామ సేవకుల ధర్నా

దేవునిపల్లి: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి మండలంలోని గ్రామ సేవకులు తాశీల్దార్‌ కార్యలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో ఇది జరిగింది. గ్రామ సేవకులకు కనీస వేతనం అమలు చేయాలని అర్హత లున్నవారిని విఆర్‌ఏలుగా నియమించాలని కోరారు. ఈఎన్‌ఐ. పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని కోరారు.