కలకలం సృష్టించిన ఫోన్‌కాల్‌

హైదరాబాద్‌ : చార్మినార్‌లో బాంబు పెట్టినట్లు వచ్చిన ఫోన్‌కాల్‌ కలకలం సృష్టించింది. నిత్యం సందర్శకులతో రద్దీగా ఉండే చారిత్రక కట్టడం చార్మినార్‌లో బాంబు పెట్టినట్లు పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ఓ ఆగంతకుడు ఫోన్‌చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్‌స్వ్కాడ్‌ రంగంలోకి దిగి తనిఖీలు చేశారు.దాదాపు గంటసేపు తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చారు. ఇది కేవలం బెదిరించటానికి ఆకతాయిలు చేసిన పనిగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల అసెంబ్లీలో బాంబు ఉన్నట్లు వచ్చిన బెదిరింపు ఫోన్‌కాల్‌, చార్మినార్‌లో బాంబు ఉందని వచ్చిన ఫోన్‌కాల్‌ రెండూ ఒకే నెంబరు నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.