కలమెత్తి పోరాడిన కాళోజీ నారాయణరావు

అశ్వరావుపేట జనం సాక్షి (సెప్టెంబర్ 9 )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్బంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు అశ్వారావుపేట మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు మందపాటి రాజమోహన్ కాళోజీ రావు ఫోటోకి పూల మాల వేసి అయన జయంతి నీ ఘనంగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమానికి ప్రతిధ్వనిగానూ, రాజకీయ, సాంఘిక చైతన్యాల సమాహారంగానూ ప్రజలు భావిస్తారని అన్నారు.హక్కులకోసం పోరాడుతూ ప్రజలే తన దేవుళ్లుగా భావించిన కాళోజీది విలక్షణమైన వ్యక్తిత్వం. తన బతుకంతా తెలంగాణకే ధారపోసిన ఆ మహనీయుడని కొన్ని యాడారు.
ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ పేరాయి గూడెం టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు చెప్పనపల్లి బజార్ అయ్యా కలపాల శ్రీనివాసరావు చెప్పనపల్లి శ్రీనివాసరావు గంధం ఆనంద్ ఆవుల చిన్ని తగరం హరి బడ్డపాటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.