కల్వకుంట్ల కుటుంబానికి దేవాలయాలు వ్యాపార కేంద్రాలు

share on facebook

కల్వకుంట్ల కుటుంబానికి దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్ వేదికగా విమర్శించారు. యాదాద్రి అభివృద్ధి అనేది పెట్టుబడి.. పవిత్ర హుండీకి ప్రజల విరాళాలు రాబడి అని మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. ‘‘కల్వకుంట్ల కుటుంబానికి గుళ్లు వ్యాపార కేంద్రాలుగా మారాయి. యాదాద్రి అభివృద్ధి పెట్టుబడి అని… హుండీల్లో భక్తుల ముడుపులు రాబడి అని ట్విటర్ టిల్లు చెబుతున్నాడు. మన హిందూ దేవాలయాలను పెట్టుబడుల అవకాశాలని చూపించేందుకే కేసీఆర్ బీఆర్‌ఎస్ ఖమ్మం సమావేశానికి ముందు ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్నారా?’’ అని బండి సంజయ్ తన ట్వీట్‌లో ప్రశ్నించారు.

Other News

Comments are closed.