కళాశాలను సందర్శించిన బలరాం జాదవ్

share on facebook

బోథ్ మండల కేంద్రంలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మంగళవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాబోయేది పరీక్షల కాలం కాబట్టి ఒక ప్రణాళిక ఏర్పరచుకొని ఇష్టపూర్వకంగా చదువి మంచి మార్కులతో పాస్ కావాలని అన్నారు.ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు మంచిగా చదివి వారికి,వారి తల్లిదండ్రులకు మరియు కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు.విద్యార్థుల కొరకు తను ఎప్పుడూ వెనకడుగు వేయనని అన్ని వేళల అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, అధ్యాపకులు పాల్గొన్నారు

Other News

Comments are closed.