కళాశాల యాజమాన్యం వేదింపులు తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి: లింగంపల్లిలోని నల్లగండ్లలో ఉన్న నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ యాజమాన్యం వేదింపులు తట్టుకోలేక తేజోనాయక్‌ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట నివాసి. ఇతడు కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.