కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.

మల్కాజిగిరి.జనంసాక్షి.మార్చి28.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, మేకల సునీత యాదవ్,మీనా ఉపేందర్ రెడ్డి, రాజ్ జితేంద్ర నాథ్,సబిత కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆనంద్ బాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్వాల్, మల్కాజిగిరి మండలాలకు చెందిన 228 మంది కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం భూముల రెగ్యులరైజేషన్ కొరకు ప్రభుత్వం విడుదల చేసిన 58 జీవో 59 లో దరఖాస్తు చేసుకున్న 397 మందికి పట్టాలను అందజేశారు.ఈకార్యక్రమంలో అల్వాల్ తహసిల్దార్ నిర్మల, మల్కాజిగిరి డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస రెడ్డి, గిర్ధావర్ రజినీకాంత్,వినీత,శ్రీశైలం, బిఆర్ఎస్ నాయకులు సతీష్ కుమార్, గుండా నిరంజన్, పిట్టల శ్రీనివాస్, రాము యాదవ్,సంతోష్ రాందాస్, భాగ్యనందరావు,ఉపేందర్ రెడ్డి,సురేష్, స,పివీ సత్యనారాయణ,పిట్టల నాగరాజు,బాలకృష్ణ గుప్తా,గణేష్ ముదిరాజ్,భాగ్యవతి,లీల,వైశాలి తదితరులు పాల్గొన్నారు.