కవాతు ఇచ్చిన అనుమతి సమయం ముగియడంతో భాష్సవాయువు ప్రయోగం
హైదరాబాద్: తెలంగాణ కవాతు నిర్వహణకు ఇచ్చిన అనుమతి సమయం ముగియడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. వాటర్ క్యానన్‌లు, భాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. కవాతువేదికవైపు భాష్ప వాయువు ప్రయోగిస్తున్నా నేతలు మాత్రం అక్కడి నుంచి కదలకుండా వేదికపైనే కూర్చున్నారు. ఒక పక్క వర్షం, మరోవైపు భాష్పవాయువు ప్రయోగంతో సాగరహారం సభాస్థలిలో గంభీర వాతావరణం నెలకొంది.



