కసబ్‌ను ఉరితీయడం హర్షణీయం భాజపా
కసబ్‌ను ఉరితీయడం హర్షణీయం భాజపా
హిమాయత్‌నగర్,ముంబాయి తాజ్ హోటల్‌లో నరమేధం సృష్టించిన కసబ్‌ను ఉరి తీయడంతో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు హిమాయత్‌నగర్‌లో సంబరాలు చేసుకున్నారు వై జంక్షన్ కూడలిలో కసబ్ చిత్రం ఉన్న
చిత్రం పై టపాకాయలు పేల్చారు అనంతరం మిఠాయిలు పంచి సంబరాలు చేశారు భాజపా గ్రేటర్ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి మాట్లాడుతూ కసబ్‌ను ఉరితీమడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించిందని చెప్పారు మొత్తానాకి ఈ ఉరి ప్రక్రియను అమలు చేసినందుకు సంతోషమని పేర్కొన్నారు భారత పార్లమెంటరీ వ్యవస్థపై దాడికి పాల్పడ్డ అప్జల్ గురుకు కూడా ఉరి శిక్షను తొందరంగా అమలు చేస్తే భారత్ లో మారణకాండ సృష్టించాలనుకునే ఉగ్రవాదులకు తగిన సమాధానం చెప్పినట్లు అవుతుందన్నారు ఈ శిక్షల వల్ల భారత్ వైపు చూసేందుకు కూగా ఇక ముందు ఎవరూ సాహసించరని అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో భాజపా నాయకులు బద్థం మహిపాల్‌రెడ్డి కేశబోయిన శ్రీధర్ గడ్డం రామన్‌గౌడ్,పి.ప్రసాద్,ఎ.నవీన్, యువమోర్చా నగర్ అధ్యక్షుడు ఎల్.నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



