కసబ్ ఉరి పూర్తి పారదర్శకమే ఉరితీతపై అమెరికా సానుకూల స్పందన
వాషింగ్టన్, నవంబర్ 22:ముంబై పేలుళ్లలో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది మహమ్మద్ అవిూర్ అజ్మల్ కసబ్‌ను ఉరి తీయడంపై అమెరికా సానుకూలంగా స్పందించింది. కసబ్ విచారణ పూర్తి చట్టబద్దంగా, పారదర్శకంగా జరిగిందని తెలిపింది. 26/11 దాడుల వెనుక ఉన్న వారిని తాజా ఘటన పాల్పడిన వారికి ఓ హెచ్చరిక అని స్పష్టం చేసింది. ముంబై దాడుల్లో నష్టపోయిన వారికి తాజా ఉదంతంతో న్యాయం జరిగిందని తెలిపింది. ‘ముంబై దాడుల బాధితులకు న్యాయం జరగడాన్ని స్వాగతిస్తున్నాం’ అని అమెరికా అధికార ప్రతినిధి మార్క్ టోనర్ తెలిపారు. కసబ్ విచారణ, ఉరితీత ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, న్యాయబద్దంగా జరిగిందని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే, అమెరికా పత్రికలు భారత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించాయి. కసబ్‌ను రహస్యంగా ఉరి తీయడంపై వాషింగ్టన్ పోస్ట్ ప్రభుత్వాన్ని కొనియాడింది.



