కాంగ్రెస్‌ని వీడేది ముఖేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌: తాను వైకాపాలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల్ని మంత్రి ముఖేశ్‌గౌడ్‌ తోసిపుచ్చారు. కాంగ్రెస్‌ని వీడేది లేదని తేల్చిచెప్పారు. అధిష్ఠానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా సరే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీచేసేందుకు సిద్ధమని ముఖేశ్‌ చెప్పారు. రాష్ట్రం విడిపోతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ఏర్పాడాలని, గ్రేటర్‌ హైదరాబాదుకు ప్రత్యేక రక్షణ నియమవళి కావాలని డిమాండ్‌చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న ప్రజల  హక్కులు కాపాడాలని కోరారు. ఎల్లుండి జరగబోయే తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశంపై తనకు ఎలాంటి సమాచారం అందలేదని ముఖేశ్‌ చెప్పారు.