కాంగ్రెస్ దాటవేత వైఖరి కొనసాగిస్తే మరణశాసనం రాసుకున్నట్లే
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ నాన్చివేత, దాటవేత, వైఖరిని ఇంకా కొనసాగిస్తే రాజకీయంగా ఆ పార్టీ తన మరణశాసనం రాసుకున్నట్లేనని టీఆర్‌ఎస్ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవటంలో ఇంకా జాప్యం చేస్తే తెలంగాణ ప్రజలు సహించరని తేల్చి చెప్పారు.



