కాంగ్రెస్ పార్టీ రోజురోజుకి దిగజారుతోంది: శంకర్‌రావు
హైదరాబాద్: కాంగ్రెస్‌ని బతికించెకోవాలంటే పార్టీలో ప్రక్షాళన జరగాల్సిందేనని మాజీ మంత్రి శంకర్‌రావు సూచించారు. బుధవారం సీఎల్సీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజురోజుకి దిగజారుతోందని భవిష్యత్తులో టికెట్ అడిగేవారే ఉండరని విమర్శించారు. సీఎం చేతగానితనం వల్లే పార్టీకి చెడ్డపేరు వస్తోందని, కిరణ్‌కుమార్ రెడ్డి పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు.



