కాంగ్రెస్ పార్టీ వల్లే దేశంలో అన్ని సమస్యలు: రావుల చంద్రశేఖర్‌రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వల్లే దేశంలో ఇన్ని సమస్యలున్నాయని తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన వైకాపా అనుచరులు ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారన్నారు. అవిశ్వాసం పెట్టలేదని తెదేపాపై వైకాపా చేస్తున్నా ఆరోపణలు అవాస్తవమని తెలియజేశారు. అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో తమ పార్టీకి తెలుసునని ఆయన స్పష్టం వ్యక్తం చేశారు.



