కాంగ్రెస్‌ సారధ్యంలోనే దేశాభివృద్థి : ఆజాద్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సారధ్యంలోని ప్రభుత్వాల వల్లే దేశాభివృద్ధి సాధ్యమైందని కేంద్రమంత్రి, కాంగ్రెస్‌ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ఇవాళ ఆయన ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌  పార్టీ దేశాభివృద్ధి కోసం కృషి చేసిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనంగా లేదని  కావాల్సినంత శక్తిని కూడగట్టుకుని ఉందని వెల్లడించారు. అయితే. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోయి వారిలో నమ్మకం కలిగించకోపోతే పార్టీని విజయం వైపు తీసుకు పోలేమని తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల, కులాల ప్రజల మనోభావాలను తమ కాంగ్రెస్‌ పార్టీ పరిరక్షిస్తుందని పేర్కొన్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంథీ ప్రతిపక్షంలో ఉండి పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వచ్చిందని గుర్తు చేశారు. ఆమె నేతృత్వంలో పార్టీ ప్రగతిపథంలోకి దూసుకు పోతుందని పేర్కొన్నారు. ఆరికమాంధ్యం నుంచి దేశాన్ని గటెక్కించిన ఘనత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ దేనని తెలియజేశారు. ప్రపంచమంతా ఆర్ధిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే భారత్‌ అభివృద్ధి పథలోనే పయనించడం గర్వనీయమని చెప్పారు.