కానిస్టేబల్‌పై కత్తితో దాడికి దిగిన దొంగ
ఒంగోలు : రైల్వే కానిస్టేబుల్‌పై ఓ దొంగ కత్తితో దాడి చేసి పరారైన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎన్-8 బోగీలో ఓ ప్రయాణికుడి బ్యాగ్ చోరీకి గురైంది. వెంటనే అక్కడ ఉన్న రైల్వే కానిస్టేబుల్ దొంగను పట్టుకునేందుకు యత్నించాడు. అయితే దొంగ కానిస్టేబుల్‌పై కత్తితో దాడిచేసి అక్కడినుంచి పరారయ్యాడు.


