కార్డన్‌ సర్చ్‌లో వాహనాలు స్వాధీనం

హైదరాబాద్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. శివరాంపల్లి వీకర్‌ సెక్షన్‌ కాలనీలో ఏసీపీ అశోక్‌ చక్రవర్తి ఆధ్వర్యంలో సిఐ సురేష్‌ సహా 150 మంది కానిస్టేబుళ్లతో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 40 బైకులతో 5 ఆటోలు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపుతోకి తీసుకున్నారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశాల మేరకు ‘ఫెల్టీ నీడ్స్‌’కార్యక్రమంతో స్థానికులతో అందుబాటులో ఉంటామని ఏసీపీ చక్రవర్తి తెలిపారు.

తాజావార్తలు