కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

ఖమ్మం కార్పొరేషన్‌: ఖమ్మం నగరపాలక సంస్థలో విలీనమైన 9 గ్రామ పంచాయతీల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయా పంచాయతీలకు పారిశుద్ధ్య పరికరాలు, విద్యుత్తు పరికరాలు అందజేయటంతో పాటు కార్మికులకు దుస్తులు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.