కావూరివి బెదిరింపు రాజకీయాలు: హరీష్‌రావు
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కాంగ్రెస్ ఎంపీ కావూరి చేస్తున్న వ్యాఖ్యల్లో చిత్తశుద్ది లేదని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. కావూరి లాంటి నేతలు తెలంగాణను అడ్డుకునేందుకు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 2014లోపే తెలంగాణ సాధించాలనేది తమ ద్యేయమని పేర్కొన్నారు. మంచి మాటలతో తెలంగాణ సాధించాలనేది ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్లాలో తమకు తెలుసని చెప్పారు. తెలంగాణ ఇవ్వకపోతే నష్టపోయేది కాంగ్రెస్సేనని మరో మారు స్పష్టం చేశారు.