కింగ్ ఫిషర్ ఉద్యోగుల చర్చలు వాయిదా
ముంబయి: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంక్షోభం కోనసాగుతోంది, సమ్మెకు దిగిన ఎయిర్‌లైన్స్ ఉద్యోగులతో నేడు జరపాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. కింగ్‌ఫిషర్ యాజమాన్చం చర్చలను ఈ నెల 17కు వాయిదా వేసింది. గత ఏడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు గత కోన్ని రోజులుగా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.



